ఆ పాము ఖరీదు రూ.1.6 కోట్లు!
- మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో సంచరించే పాము
- ప్రస్తుతం పోలీసుల స్వాధీనంలో ఆరుదైన సర్పరాజం
- చైనాకు స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు
దీంతో, వారి వద్ద కోట్ల రూపాయల విలువ చేసే అరుదైన సర్పరాజం లభించడంతో అవాక్కయ్యారు. దాన్ని స్వాధీనం చేసుకుని వారిని ప్రశ్నించగా మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో సంచరించే ఈ అరుదైన సర్పరాజాన్ని చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అటవీ శాఖాధికారి సురేంద్ర భగత్ మాట్లాడుతూ ఈ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ముఖ్యంగా చైనాలో మంచి మార్కెట్ ఉందని తెలిపారు. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా ఈ పామును నేపాల్ దేశం మీదుగా చైనాకు తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడిందని తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్టు చేశామని తెలిపారు.