ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో.. విశాఖ బ్లడ్‌క్యాన్సర్ బాలుడికి అందుతున్న వైద్యం
- ఇచ్చిన మాట మేరకు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్
- నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
- పూర్తి స్థాయి వైద్యం అందించాలని ఆదేశం
కారులోంచి బ్యానర్ చూసిన ముఖ్యమంత్రి కారు దిగి వారితో మాట్లాడారు. విషయం తెలుసుకుని ఓదార్చారు. నీరజ్‌కుమార్ వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని అక్కడికక్కడే మాటిచ్చారు. ఈ మాట మేరకు ఇప్పటికే నీరజ్ వైద్యం కోసం ప్రభుత్వం రూ.10 లక్షలు విడుదల చేసింది. ఇంకా ఎంతమొత్తమైనా ప్రభుత్వం సమకూర్చుతుందని కుటుంబ సభ్యులకు, ఆసుపత్రి వర్గాలకు ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. నీరజ్‌కు అందుతున్న వైద్యంను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సీఎంఓ అధికారులు తెలిపారు.