శర్వానంద్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు
- షూటింగ్ సమయంలో శర్వా కుడి చేతికి ఫ్రాక్చర్
- గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న శర్వా
- అత్యాధునిక చికిత్స అందించామన్న వైద్యులు
శర్వా గాయాల గురించి సన్‌షైన్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, అత్యాధునిక చికిత్సనందించి గాయం త్వరగా మానేలా చేశామన్నారు. ప్రస్తుతం శర్వా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాయం తీవ్రత తగ్గిన కారణంగానే శర్వాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించారు.