కోడెల శివరామ్ మా భూమిని ఆక్రమించారు.. పోలీసులకు 16 మంది రైతుల ఫిర్యాదు!
- గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఘటన
- ధూళిపాళ్ల గ్రామంలో 17.52 ఎకరాల దురాక్రమణ
- పోలీసులకు ఫిర్యాదు చేసిన వెన్నాదేవి గ్రామ రైతులు
ముత్తాతల నుంచి ఈ భూమి తమకు సంక్రమించిందని చెప్పారు. అయితే ఈ భూమిపై కోడెల కుమారుడి కన్ను పడటంతో తమను వేధించడం ప్రారంభించారని వాపోయారు. ఈ భూమిని కోడెల శివరామ్ ఆక్రమించుకున్నారనీ, తమ భూమిని వెంటనే వెనక్కి ఇప్పించాలని పోలీసులను కోరారు. కాగా, ఈ వ్యవహారంలో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు.