విశాఖ, విజయవాడ, తిరుపతిలో ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం!: మంత్రి అవంతి శ్రీనివాస్
- త్వరలోనే అమలుచేస్తామన్న టూరిజం మంత్రి
- దేశంలోనే ఏపీ 3వ స్థానంలో ఉందని వెల్లడి
- దేశ,విదేశాల నుంచి టూరిస్టులు క్రమంగా పెరుగుతున్నారని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో విదేశీ టూరిస్టులు తిరుపతి, విశాఖ, విజయవాడలో దిగాక ఎయిర్ పోర్టులోనే వీసా తీసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఏపీ టూరిజం కోసం బ్రాండ్ అంబాసిడర్లను నియమిస్తామన్నారు. రాజస్థాన్ లోని చౌకీ ధనీ, ఢిల్లీ హట్ ప్రాంతాలు భోజనానికి కేరాఫ్ గా నిలిచాయని అవంతి గుర్తుచేశారు. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడి ఆహారపదార్థాలను రుచి చూసేందుకు వస్తుంటారని తెలిపారు. ఏపీలోని శిల్పారామాన్ని త్వరలోనే ఆ స్థాయిలో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.