జగన్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన కేసీఆర్... వీడియో!

షార్ట్స్‌లో చూడండి
కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం మేడిగడ్డకు చేరుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముందే వచ్చిన కేసీఆర్, జల సంకల్ప హోమంలో పాల్గొన్న వేళ, జగన్ వచ్చారన్న సమాచారాన్ని అధికారులు ఆయనకు అందించారు. దీంతో ఆయన ఎదురెళ్లి, జగన్ మెడలో శాలువా వేసి, యాగ మండపం వద్దకు తీసుకెళ్లారు. జగన్ తో పాటు ఏపీ నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. జగన్ తో కరచాలనం చేసేందుకు, ఆయన్ను పలకరించేందుకు తెలంగాణ టీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఉత్సాహం చూపించారు. మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్, జగన్ లతో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ప్రారంభించనున్నారు.
Go Back to Shorts
Jagan
Peddireddy
Anil Kumar
Kaleshwaram
KCR

More Telugu News