మహత్తర ఘట్టానికి ముహూర్తం నేడే.. మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్న కేసీఆర్
- ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
- మరికాసేపట్లో మేడిగడ్డకు కేసీఆర్
- ముఖ్య అతిథులుగా జగన్, ఫడ్నవిస్
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఆయన మేడిగడ్డ చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు కన్నెపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి అమరావతి బయలుదేరుతారు.
ఇక, ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 9:55కు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపు హౌస్‌కి చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు.