కథా చర్చలు ఖరీదైన హోటల్స్ లో అవసరం లేదు : దర్శకుడు రేలంగి నరసింహారావు
- నా సినిమాలన్నీ లోబడ్జెట్ లో చేసినవే
- నిర్మాతలకి లాభాలు తెచ్చే సినిమాలు చేశాను
- మేడ మీద గదిలో కూర్చుని ఆలోచించవచ్చు
ఇప్పుడు అనవసరంగా బడ్జెట్ పెంచేస్తున్నారు. కథా చర్చలు అంటూ ఖరీదైన హోటల్స్ లో 3 నెలల నుంచి 6 నెలల వరకూ సిటింగ్ వేస్తున్నారు. ఈ కారణంగా నిర్మాతకి ఏ స్థాయిలో ఖర్చు పెరిగిపోతుందో ఒకసారి ఆలోచించాలి. ప్రశాంతమైన వాతావరణం కోసం, ఏ మేడ మీద గదిలో కూర్చుని ఆలోచన చేసినా సరిపోతుంది. బుర్రపెట్టి ఆలోచించవలసిన పనికి ఖరీదైన హోటల్స్ లో సిటింగ్స్ ఎందుకు?' అంటూ ఆయన తన మనసులోని మాటను చెప్పారు.