అసెంబ్లీలో చాంబర్ల కేటాయింపు కొలిక్కి.. చంద్రబాబుకు మండలి బుద్దప్రసాద్‌ చాంబర్‌

ఏపీ శాసనసభలో చాంబర్ల కేటాయింపు ఒక కొలిక్కి వచ్చింది. చంద్రబాబుకు ఇప్పటికే తాత్కాలికంగా కేటాయించిన మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ చాంబర్‌ను ఖరారు చేశారు. గతంలో జగన్‌కు కేటాయించిన చాంబర్‌ను నిన్న డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన కోన రఘుపతికి కేటాయించారు.

కాగా, చంద్రబాబుకు ఒక చాంబర్‌ కేటాయించినందున, టీడీఎల్పీకి కూడా మరో చాంబర్‌ కేటాయించాలని పార్టీ నాయకులు స్పీకర్‌ను కోరగా స్పీకర్‌ పరిశీలిస్తామని తెలిపారు. కాగా, గతంలో అధికార టీడీపీ సమావేశాలకు ఉపయోగించుకునే రెండు చాంబర్లతోపాటు దాన్ని ఆనుకుని ఉన్న మరో గదిని అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించినట్లు సమాచారం.
Go Back to Shorts
secreteriat
Chandrababu
chambers

More Telugu News