శారదా పీఠానికి రెండెకరాల భూమి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- దర్శకుడు ఎన్.శంకర్ కు ఐదెకరాల భూమి
- తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం
- పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఈ నేపథ్యంలో, శారదా పీఠానికి తెలంగాణలో స్థలం కేటాయించాలని కేసీఆర్ మంత్రివర్గం నిర్ణయించింది. ఇవాళ సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. శారదా పీఠానికి రెండెకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాకుండా, తెలంగాణ సినీ దర్శకుడు ఎన్.శంకర్ కు స్టూడియో నిర్మాణం కోసం మోకిళ్ళ వద్ద 5 ఎకరాల భూమి ఇవ్వాలని కూడా తీర్మానించారు.