సినిమాల సంఖ్య గురించి నేను పట్టించుకోను: మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాల సంఖ్య గురించి నేను పట్టించుకోను: మహేశ్ బాబు

  • మంచి సినిమాలు తీయడంపైనే దృష్టి
  • స్క్రిప్ట్ విషయంలో జోక్యంచేసుకోను
  • నమ్రత చాలా కచ్చితమైన వ్యక్తి
టాలీవుడ్ అగ్రహీరో మహేశ్ బాబు ఓ కార్యక్రమంలో పలు ప్రశ్నలకు జవాబిచ్చాడు. ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించానన్నది ఎప్పుడూ పట్టించుకోలేదని, ప్రేక్షకులకు వినోదం అందించడంపైనే తన దృష్టి ఉంటుందని తెలిపాడు. మహర్షితో 25 సినిమాలు పూర్తిచేసుకున్న మహేశ్ బాబు త్వరలోనే 26వ సినిమాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించనున్నాడు. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. తన తండ్రి ఫ్యాన్స్, తన అభిమానులు ఇప్పటివరకు ఎంతో ప్రోత్సాహాన్నందించారని, వారికి నచ్చే సినిమాలు తీయడమే తనకు ఇష్టం అని మహేశ్ పేర్కొన్నాడు.

వెంటవెంటనే సినిమాలు చేయాలని కోరుకోనని, సెలెక్టివ్ గా సినిమాలు చేసినా అందరినీ అలరించేలా ఉండాలని కోరుకుంటానని స్పష్టం చేశాడు. కథ ఒక్కసారి ఫైనలైజ్ చేశాక, స్క్రిప్ట్ విషయంలో జోక్యం చేసుకోనని, దర్శకుడు ఎంత కష్టపడి స్క్రిప్ట్ తయారుచేసుకుంటాడో తనకు తెలుసని మహేశ్ బాబు వ్యాఖ్యానించారు. సెట్స్ మీద దర్శకుడు ఏం చెబితే అదే చేస్తాను తప్ప, దర్శకుడి పనిలో ఇన్వాల్వ్ కానని స్పష్టం చేశాడు.

కుటుంబం విషయానికొస్తే, నమ్రత అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని చెప్పాడు. పిల్లల పెంపకంలో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ ఎంతో కచ్చితంగా ఉంటుందని అన్నాడు. పిల్లల్ని తాను గారాబం చేసినా నమ్రత వాళ్లతో కాస్త కఠినంగా వ్యవహరిస్తుందని మహేశ్ బాబు వివరించాడు. బిజినెస్ పరంగా కూడా నమ్రతపై ఎంతో నమ్మకం ఉందని, అందుకే ఆమె వ్యవహారాల్లో కలుగజేసుకోనని తెలిపాడు.
Mahesh Babu
Tollywood

More Telugu News