పక్కపక్కనే కూర్చున్న విజయసాయిరెడ్డి, సీఎం రమేశ్.. సుదీర్ఘ చర్చలు!
- లోక్ సభలో ఆసక్తికర సన్నివేశం
- ఆప్యాయంగా మాట్లాడుతూ.. సుదీర్ఘంగా చర్చించిన నేతలు
- అందరి దృష్టిని ఆకర్షించిన మంతనాలు
ఆ తర్వాత ఇద్దరూ కలసి దాదాపు గంటన్నరకు పైగా చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ, సుదీర్ఘంగా చర్చించారు. కాసేపటి తర్వాత అక్కడకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చి... వారిద్దరికీ కొంత దూరంలో కూర్చున్నారు. ఆ తర్వాత కూడా విజయసాయి, సీఎం రమేష్ లు చర్చల్లోనే మునిగిపోయారు. వీరి మంతనాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
సమావేశానంతం ఇదే విషయం గురించి విజయసాయిరెడ్డిని మీడియా ప్రతినిధులు ఆరా తీశారు. దీనికి సమాధానంగా... 'మీ హయాంలో ఏం మేం చేశారో?' చెప్పమని రమేష్ ను అడిగానని విజయసాయిరెడ్డి నవ్వుతూ బదులిచ్చారు.