ప్రధాని దగ్గర ముఖం చెల్లకనే కేసీఆర్ వెళ్ల లేదు: బీజేపీ నేత లక్ష్మణ్

  • మోదీ మళ్లీ ప్రధాని కారని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు
  • ముఖం చెల్లకనే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ల లేదు
  • ‘కాళేశ్వరం’ ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించాలి
సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాదని, మోదీ మళ్లీ ప్రధాని కాలేరని కేసీఆర్, కేటీఆర్ లు ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. మోదీ దగ్గర ముఖం చెల్లకనే నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన వెళ్లలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎంతో చేసిందని, ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని, త్వరలోనే కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Telangana
kcr
KTR
modi
bjp
Laxman

More Telugu News