West Godavari District: పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్లి బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు

షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ గోదావరి జిల్లాలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పెళ్లి బస్సు బోల్తా పడిన ఘటనలో 25 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వీరిని జంగారెడ్డి గూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం వెళ్తున్న బస్సు జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తాపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.  
Go Back to Shorts
West Godavari District
Eluru
Bhadradri Kothagudem District
Road Accident

More Telugu News