మా ప్రభుత్వం ఏం చేస్తుందో గవర్నర్ చెప్పారు...చెప్పింది కచ్చితంగా ఐదేళ్లలో చేస్తాం : బొత్స
- హామీలన్నీ అమలు చేయాలన్నదానికి కట్టుబడి ఉన్నాం
- అవినీతి లేని పాలన ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం
- విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం
ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తామని తెలిపారు. అవినీతిలేని నీతివంతమైన పారదర్శక పాలన అందించడం జగన్ లక్ష్యమన్నారు. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారని తెలిపారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. వైద్యం కోసం ఇకపై ఏ నిరుపేద ఇబ్బంది పడాల్సిన పనిలేదని, వెయ్యి ఖర్చు దాటితే ప్రభుత్వమే దాన్ని భరిస్తుందన్నారు. నిర్బంధ విద్య కోసం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామన్నారు. రైతాంగం సంక్షేమం కోసం మరిన్ని మెరుగైన పథకాలు అమలు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చనున్నట్లు చెప్పారు.