ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
- ఫస్టియర్ లో 53,025 మంది ఉత్తీర్ణత
- సెకండియర్ లో 66,114 మంది పాస్
- ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
మార్చిలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు మొత్తం 4,76,710 మంది విద్యార్థులు హాజరుకాగా, వారిలో 2,86,932 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇప్పుడు సప్లిమెంటరీ ఫలితాల నేపథ్యంలో మొత్తం 3, 39,957 మంది ఇంటర్ ఫస్టియర్ పాసయ్యారు. ఇక సెకండియర్ విషయానికొస్తే, మార్చిలో 4,31,739 మంది పరీక్షలు రాయగా, 3,09,721 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇప్పుడు సప్లిమెంటరీ ఫలితాలతో కలుపుకుని ఇంటర్ సెకండియర్ లో ఉత్తీర్ణులైన వారి సంఖ్య 3,75,835కి చేరింది.