ajith: మహిళలను ఇబ్బందిపెట్టే పాత్రలను చేసినందుకు బాధపడుతున్నాను: హీరో అజిత్

షార్ట్స్‌లో చూడండి
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతాఇంతా కాదు. వరుస సినిమాలతో .. వరుస విజయాలతో ఆయన దూకుడు కొనసాగుతూనే వుంది. ప్రస్తుతం ఆయన హిందీ 'పింక్' సినిమా తమిళ రీమేక్ లో చేస్తున్నాడు. 'నెర్కొండ పార్వై' అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది. వినోద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి నిన్ననే టీజర్ ను వదిలారు.

ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, "కెరియర్ తొలినాళ్లలో మహిళలను ఇబ్బందిపెట్టే తరహాలో సాగే పాత్రలు కొన్ని చేశాను. అప్పుడు నేను ఈ విషయాన్ని గురించి అంతగా ఆలోచించలేదు. కానీ అలాంటి పాత్రలను చేసినందుకు ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ఆ తప్పును సరిదిద్దుకుని .. మహిళలను గౌరవించే ఆదర్శవంతమైన పాత్రలను చేయాలని అనుకున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా చేసినదే ' 'నెర్కొండ పార్వై' అంటూ చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
ajith

More Telugu News