హార్దిక్ పాండ్యా నాకంటే ఉన్నతంగా ఎదగాలి: కపిల్ దేవ్
- పాండ్యా ఓ ఆల్‌రౌండర్ అన్న కపిల్
- బౌలింగులో మరింత రాణించాల్సి ఉందన్న దిగ్గజ క్రికెటర్
- అతడిని తనతో పోల్చవద్దని అభిమానులకు విన్నపం
2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తర్వాత పాండ్యా రోజురోజుకు రాటుదేలుతున్నాడు. బ్యాట్‌తో అద్భుతాలు చేశాడు. మరపురాని ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే, బౌలింగులో మాత్రం కొంత వెనకబడ్డాడు. ఈ విషయాన్ని కపిల్ ప్రస్తావిస్తూ అతడి బ్యాటింగ్‌పై ఎటువంటి సందేహాలు లేవని, బౌలింగులోనే కొంత మెరుగు కావాల్సి ఉందన్నాడు. అతడికి గొప్ప జట్టు అండగా ఉందని, ఇది చాలా ముఖ్యమని కపిల్ పేర్కొన్నాడు.