మాకొచ్చిన నష్టమేమీ లేదు.. రావెల కిశోర్ బాబు రాజీనామాపై జనసేన!
- అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలోకి
- ఆపై ఓడిపోయి రాజీనామా చేసిన రావెల
- ఆయనవి అవకాశవాద రాజకీయాలన్న పార్టీ
ప్రత్తిపాడులోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన నేతలు, రావెల మంత్రిగా పని చేసిన సమయంలోనే టీడీపీ శ్రేణులు ఆయన్ను అవమానాలకు గురి చేశాయని, ఆ సమయంలో ఆదరించి, అక్కున చేర్చుకుంటే, పవన్ నమ్మకాన్ని వమ్ము చేసిన రావెల, అవకాశవాద రాజకీయాలకు పాల్పడ్డారని నాయకులు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.