ఉభయ సభల్లో బీజేపీ పక్ష నేతల జాబితా విడుదల
- బీజేపీ లోక్ సభాపక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోదీ
- ఉప నేతగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్
- రాజ్యసభాపక్ష నేతగా థావర్ చంద్ గెహ్లాట్
ఇదిలా ఉండగా, బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపికకు కసరత్తు ప్రారంభమైంది. రేపు ఉదయం పదకొండు గంటలకు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం జరగనుంది. పార్టీ జాతీయ పదాధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు.