తెలంగాణ స్పీకర్ కు మరోసారి నోటీసులు జారీ చేసిన హైకోర్టు

  • సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడంపై హైకోర్టులో విచారణ
  • పిటిషన్ వేసిన భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • స్పీకర్, 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు నిన్ననే స్పీకర్ కు నోటీసులు జారీ చేసింది. ఈరోజు మరోసారి నోటీసులు జారీ చేయడం గమనార్హం. స్పీకర్ తో పాటు అసెంబ్లీ కార్యదర్శి, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి.
Go Back to Shorts
telangana
speaker
high court
notice

More Telugu News