మరో యూపీ జర్నలిస్టుకు తీవ్ర అవమానం... నోట్లో మూత్రం పోసిన రైల్వే అధికారి!
- అనధికారిక వ్యాపారులపై కథనం కోసం వచ్చిన అమిత్ శర్మ
- అడ్డుకుని దారుణంగా కొట్టిన రైల్వే ఇన్‌స్పెక్టర్ రాకేశ్
- విధుల నుంచి తొలగించిన ఉన్నతాధికారులు
వార్తను చిత్రీకరిస్తున్న తనను, దారుణాతి దారుణంగా కొట్టారని, కెమెరాను ధ్వంసం చేశారని, స్టేషన్ కు తీసుకెళ్లి, లాకప్ లో వేసి బట్టలూడదీసి, నోటిలో మూత్రం పోశారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు, ఘటనకు బాధ్యుడైన రాకేశ్ ను, మరో రైల్వే కానిస్టేబుల్ ను విధుల నుంచి తొలగిస్తూ, ఆదేశాలు జారీ చేశారు.