ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ చివరి కోరికను తీర్చిన కుటుంబ సభ్యులు!
Add ap7am to your home Screen

ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ చివరి కోరికను తీర్చిన కుటుంబ సభ్యులు!

  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం
  • నిరాకరించిన కుటుంబ సభ్యులు 
  • సాదాసీదాగా నిర్వహించాలని కోరిన కర్నాడ్
ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. అయితే కర్నాడ్ కుటుంబ సభ్యులు ఇందుకు ఒప్పుకోలేదు.

తన అంతిమ సంస్కారాలు సాదాసీదాగా నిర్వహించాలని చనిపోయేముందు కర్నాడ్ కోరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంతిమయాత్రలో అభిమానులు, పోలీసు బలగాలు కూడా వద్దన్నారని చెప్పారు. దీంతో కర్నాడ్ నిర్ణయాన్ని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం కర్నాడ్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఆయన కోరుకున్నట్లుగానే జరిపించారు.
Bollywood
girish karnad
last rites

More Telugu News