ఒడిశాలో దారుణం.. పంట బాగా పండాలని నరబలి!
- సోదరుడి కొడుకును బలిచ్చిన రైతు
- తాంత్రికుడి మాటలపై విశ్వాసంతో ఘాతుకం
- పోలీసుల అదుపులో నిందితుడు
అది చూసిన చింతామణి ఆ చిన్నారిని పిలిచి పొలంలోనే పీక కోసి చంపేశాడు. దూరం నుంచి గమనించిన బాలుడి తండ్రి రూప్‌సింగ్ పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తన వద్ద నున్న కత్తితో తమ్ముడిని కూడా చింతామణి బెదిరించాడు. చూసిన చుట్టుపక్కల రైతులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఖరీఫ్ సాగు బాగుండాలంటే నరబలి ఇవ్వాలన్న తాంత్రికుడి మాట ప్రకారమే ఈ పని చేసినట్టు చింతామణి పోలీసులకు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.