లండన్లో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 20 ఫ్లాట్లు
- తూర్పు లండన్లోని డీపాస్ గార్డెన్స్ సమీపంలో ఘటన
- రెండు గంటలపాటు శ్రమించిన వందమంది ఫైర్ సిబ్బంది
- ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్న పోలీసులు
తొలుత ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని, ఆ చుట్టుపక్కల ఉన్నవారిని రక్షించి దూరంగా తరలించారు. ఆ మార్గాన్ని మూసివేశారు. ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు తీస్తున్నారు.