‘ఓం నమో వెంకటేశాయ..’ అంటూ శ్రీవారి స్తోత్రాన్ని పఠిస్తూ ప్రసంగం ప్రారంభించిన మోదీ
- స్వామికి నా ప్రణామాలు
- మళ్లీ మాకు అధికారమిచ్చిన ప్రజలందరికీ కృతఙ్ఞతలు
- ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం నాకు లభించింది
ఆ తర్వాత హిందీ భాషలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, వేంకటేశ్వరుడి సన్నిధిలో ఇంతపెద్ద సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శ్రీలంక నుంచి నేరుగా ఇక్కడికి రావడంలో కొంత ఆలస్యం జరిగిందని, అందుకు తనను క్షమించాలని కోరారు. తిరుపతికి అనేకసార్లు వచ్చే అదృష్టం తనకు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. వేంకటేశ్వరుడి సన్నిధిలో తల వంచి ఆశీస్సులు తీసుకుందామని ఇక్కడికి వచ్చానని, దేవ దేవుని దర్శనానికి వెళ్తూ ప్రజా దేవుళ్లను సందర్శించే భాగ్యం తనకు లభించిందని మోదీ వ్యాఖ్యానించారు.