నాదెండ్ల బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై స్పందించిన జనసేన!

  • ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన నాదెండ్ల
  • తెనాలి నుంచి పోటీపడి ఓటమి
  • పార్టీని వీడబోరని స్పష్టం చేసిన జనసేన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, ఎన్నికలకు ముందు జనసేనలో చేరి, గత ఎన్నికల్లో తెనాలి నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన నేత నాదెండ్ల మనోహర్‌ బీజేపీలో చేరనున్నారని వచ్చిన వార్తలపై పార్టీ స్పందించింది. గుంటూరు జిల్లాలో ఓటమికి కారణాలను అన్వేషిస్తూ, పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించగా, దానికి నాదెండ్ల హాజరుకాకపోవడంతో ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో స్పందించిన జనసేన, అమెరికా పర్యటనలో ఉన్న కారణంగానే నాదెండ్ల సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేసింది. ఆయన పార్టీని వీడబోరని, కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది.
Go Back to Shorts
Jana Sena
Nadendla Manohar
BJP
Pawan Kalyan

More Telugu News