100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'భారత్'
- 4,700 థియేటర్స్ లో 'భారత్'
- తొలి రోజున రికార్డుస్థాయి వసూళ్లు
- ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన సల్మాన్
దేశవ్యాప్తంగా 4,700 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా, తొలిరోజు వసూళ్ల విషయంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' రికార్డును అధిగమించింది. తొలిరోజున 42.30 కోట్లను .. రెండో రోజున 31 కోట్లను .. మూడో రోజున 28 కోట్లను వసూలు చేసింది. ఇలా ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ట్విట్టర్ ద్వారా సల్మాన్ ధన్యవాదాలు తెలియజేశాడు.