మహేశ్ బాబుతో ఎలాంటి గొడవ జరగలేదు: దర్శకుడు తేజ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబుతో ఎలాంటి గొడవ జరగలేదు: దర్శకుడు తేజ

  •  'నిజం' చాలా మంచి సినిమా'
  • 'ఒక్కడు' ముందుగా రిలీజ్ అయింది
  • మహేశ్ ఇమేజ్ మారిపోయింది
తెలుగు తెరకి ప్రేమకథా చిత్రాలను కొత్త కోణంలో పరిచయం చేసిన దర్శకుడు తేజ. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'నిజం' సినిమాను గురించి ప్రస్తావించారు. "మహేశ్ బాబుతో నేను చేసిన 'నిజం' చాలా విభిన్నమైన సినిమా. అయితే ఈ సినిమాకంటే ముందుగా మహేశ్ చేసిన 'ఒక్కడు' విడుదలైంది.

దాంతో ఒక్కసారిగా మహేశ్ బాబు ఇమేజ్ మారిపోయింది. అందువల్లనే ఆ తరువాత వచ్చిన 'నిజం' సినిమాలో మహేశ్ బాబును నేను చూపించినట్టుగా చూడలేకపోయారు. మహేశ్ బాబు ఇమేజ్ కథకి అడ్డం పడటం వల్లనే ఆ సినిమా పరాజయంపాలైంది. ఈ సినిమా సమయంలో మహేశ్ బాబుతో నాకు గొడవైందనే వార్త అప్పటి నుంచి కూడా అక్కడక్కడా వినిపిస్తూనే వుంది. నిజానికి ఆయనకీ .. నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు .. రావు" అని చెప్పుకొచ్చారు. 
teja
Mahesh Babu

More Telugu News