మోదీకి మరో లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్
- కశ్మీర్ అంశంతో పాటు అన్ని సమస్యలపై చర్చకు సిద్ధం
- ప్రాంతీయ అభివృద్ధి కోసం కలసి పని చేద్దాం
- సమస్యల పరిష్కారానికి చర్చలే ఏకైక మార్గం
ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇరు దేశాలు కలసికట్టుగా పని చేయాలని లేఖలో ఇమ్రాన్ ఆకాంక్షించారు. ఇరు దేశాల్లో పేదరికం ఉందని... దీన్ని అధిగమించేందుకు ఇరు దేశాల మధ్య చర్చలే ఏకైక మార్గమని తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.