ఎస్ఆర్ నగర్ లో దారుణం.. ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై హత్యాయత్నం!
- ఈ నెల 5న ప్రేమపెళ్లి చేసుకున్న జంట
- తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు
- వాహనంలో వెళ్తున్న జంటపై దుండగుల దాడి
అనంతరం, తమకు ఇరు కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో వీళ్లిద్దరూ నేడు ఫిర్యాదు చేశారు. అనంతరం బయటకు వచ్చి ఈ జంట తమ వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. యువకుడిని కత్తులతో పొడిచి, దుండగులు పరారయ్యారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, ఈ దాడి ఘటనపై మరో కథనం వినిపిస్తోంది. రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకున్నారని, బయటకు వచ్చిన తర్వాత ఆ యువకుడిపై దాడి జరిగిందని తెలుస్తోంది. దాడిలో గాయపడ్డ అతన్ని పోలీసులే సమీప ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.