తల్లిదండ్రులు అప్పు చెల్లించలేదని.. రెండేళ్ల చిన్నారిని దారుణంగా చంపిన వైనం!
- పదివేల రూపాయలు అప్పు చెల్లించలేదని ఆగ్రహం
- అదృశ్యమైన 3 రోజులకు చెత్తకుప్పలో శవంలా చిన్నారి
- కుక్కలు పీక్కుతింటుండగా పోలీసులకు సమాచారం
చిన్నారి ఇంటి నుంచి అదృశ్యమైన మూడు రోజుల తర్వాత ఈ నెల 2న ఇంటి సమీపంలోని చెత్తకుప్పలో శవంగా కనిపించింది. కుక్కలు బాలిక మృతదేహాన్ని పీక్కు తింటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడింది చిన్నారి పొరుగింటి వ్యక్తులు జహీద్, అస్లాంలుగా పోలీసులు గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ నేరాన్ని అంగీకరించారని అలీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆకాశ్ కుల్హరి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది.