'జబర్దస్త్'లో అవకాశం రావడం నా అదృష్టం: నటుడు గణపతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'జబర్దస్త్'లో అవకాశం రావడం నా అదృష్టం: నటుడు గణపతి

  • హైపర్ ఆది ఇచ్చిన డైలాగ్ చెప్పాను
  •  అదిరే అభి తన స్కిట్ లో ఛాన్స్ ఇచ్చాడు
  •  నేను నిలదొక్కుకోవడానికి వాళ్లే కారకులు  
'జబర్దస్త్'లో అవకాశం కోసం ముందుగా నేను హైపర్ ఆదిని కలిశాను. ఆయన ఒక డైలాగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటే చేశాను. నేను బాగా చేస్తున్నానని చెప్పి, 'అదిరే అభి'కి నా గురించి ఆది చెప్పాడు. దాంతో ఇక నుంచి తన టీమ్ లో చేయమనీ .. ఎపిసోడ్ కి ఇంత అమౌంట్ ఇస్తానని అదిరే అభి నాకు చెప్పాడు. తొలిసారి చేసిన స్కిట్ డబ్బులు వెంటనే ఇచ్చేశాడు. దాంతో నాకు చాలా ఆనందంగా అనిపించింది.

'జబర్దస్త్'లో అవకాశం కోసం ఎంతోమంది వచ్చివెళుతుండేవాళ్లు. వాళ్లందరినీ చూసిన తరువాత ఈ కార్యక్రమంలో నాకు ఇంత ఈజీగా అవకాశం రావడం నా అదృష్టమేనని అనుకున్నాను. నాకు ఈ రోజున ఈ స్థాయి గుర్తింపు రావడానికీ, ఆర్థికంగా నేను నిలదొక్కుకోవడానికి హైపర్ ఆదీ .. అదిరే అభి కారకులు" అంటూ చెప్పుకొచ్చాడు. 
ganapathi

More Telugu News