భారీ నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ఆర్బీఐ రెపో రేట్ తగ్గింపు ప్రభావం
- కుదేలైన స్టాక్ మార్కెట్లు
- ఈ ఏడాదిలో ఒక రోజులో ఇంత నష్టం ఇదే తొలిసారి
సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా 40,000, 12,000 పాయింట్ల మార్క్ కు దిగువకు చేరడంతో అన్ని రంగాలూ నష్టాల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా, పీఎస్ యూ బ్యాంక్స్ సంస్థల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రైవేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా రంగాలు కూడా అదే బాటలో నడిచాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, ఇండస్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ షేర్లు నాలుగు నుంచి ఎనిమిది శాతం నష్టపోగా, కోల్ ఇండియా, టైటాన్, హీరో మోటార్స్ మొదలైన సంస్థల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి.