Salman Khan: అందరూ చూస్తుండగానే బాడీగార్డ్ పై చేయిచేసుకున్న సల్మాన్ ఖాన్

  • బాలుడితో బాడీగార్డ్ దురుసు ప్రవర్తన
  • బాడీగార్డ్ చెంపచెళ్లుమనిపించిన సల్మాన్
  • వీడియో వైరల్

బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ ఎంత సౌమ్యంగా కనిపిస్తాడో, ఆగ్రహం వస్తే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తాడు. ముంబయిలో 'భారత్' సినిమా ప్రదర్శన సందర్భంగా ఓ బాడీగార్డ్ సల్మాన్ ఆగ్రహానికి గురయ్యాడు. అతడు చేసిన నేరం, సల్మాన్ నడిచి వస్తుండగా ఓ బాలుడ్ని పక్కకి జరగమని నెట్టడమే. తన అభిమాని అయిన ఆ బాలుడితో బాడీగార్డ్ నిర్లక్ష్యపూరిత ప్రవర్తన సల్మాన్ ను ఆగ్రహానికి గురిచేసింది. దాంతో, వెళుతున్నవాడల్లా ఆగి ఆ బాడీగార్డ్ చెంపచెళ్లుమనేలా కొట్టాడు. అందరూ చూస్తుండగా, ఊహించని పరిణామానికి బిక్కచచ్చిపోయిన ఆ బాడీగార్డ్ వెంటనే తలదించుకుని వెనక్కి జరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

More Telugu News