rana: 'విరాటపర్వం' కోసం రంగంలోకి రానా

షార్ట్స్‌లో చూడండి
వైవిధ్యభరితమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ రానా ముందుకు వెళుతున్నాడు. ఒక వైపున తమిళ .. హిందీ సినిమాలు చేస్తూనే మరో వైపున తెలుగులో ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. తెలుగులో రానా చేయనున్న ఆ సినిమా పేరే 'విరాటపర్వం'.

1920 నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. వేణు ఊడుగుల దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవి నటించనుంది. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని రానా భావిస్తున్నాడు. ఇక సాయిపల్లవి కూడా ఈ సినిమా తనకి మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకంతో వుంది.
Go Back to Shorts
rana
saipallavi

More Telugu News