balakrishna: బాలకృష్ణ 105వ సినిమాకి ముహూర్తం ఖరారు

  • పట్టాలెక్కుతోన్న బాలకృష్ణ 105వ సినిమా
  •  ఈ నెల 12వ తేదీన లాంచ్ 
  • పరిశీలనలో 'రూలర్' టైటిల్    

బాలకృష్ణ 105వ సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లనుంది. రాజకీయాల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకావలసి వుంది. కానీ ఎన్నికల ఫలితాల తరువాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు .. చేర్పులు చేయవలసి రావడం వలన ఆలస్యమైందని అంటున్నారు.

సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన లాంచ్ చేయనున్నారు. ఈ నెల చివరి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. అందువలన తప్పకుండా ఈ పండుగ బరిలోకి దిగవలసి వుంది. ఈ సినిమా టైటిల్ 'రూలర్' అనే టాక్ వినిపిస్తోంది. టైటిల్ తో పాటు కథానాయికల విషయంలోను త్వరలో క్లారిటీ రానుంది.

More Telugu News