ముఖ్యమంత్రి జగన్ తో డీజీపీ సవాంగ్ భేటీ.. సీఎం చేతిలో సమర్థులైన ఐపీఎస్ అధికారుల జాబితా!
- తాడేపల్లిలో సీఎంతో డీజీపీ భేటీ
- సమర్థులైన అధికారుల జాబితా సమర్పణ
- 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న బదిలీలు
సమర్థవంతమైన ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్న ఇలాంటి ఐపీఎస్ అధికారుల జాబితాను రూపొందించాలని సవాంగ్ కు జగన్ సూచించారు. తాజాగా ఆ నివేదికను జగన్ కు సమర్పించిన సవాంగ్.. ఏయే జిల్లాకు ఎవరిని నియమించాలన్న విషయమై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ జాబితాకు అనుగుణంగా రాబోయే 2-3 రోజుల్లో ఐపీఎస్ ల బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.