10వ తేదీన జగన్ తొలి మంత్రివర్గ సమావేశం?
- ఈనెల 8వ తేదీన మంత్రివర్గ ప్రమాణ స్వీకారం
- 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు
- వ్యూహ రచనపై రెండు రోజుల ముందే భేటీ కావాలని నిర్ణయం
మరోవైపు ఈనెల 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందువల్ల10వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సహచరులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడం, ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తామన్న ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.