ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సర్కారు పనిచేయాలి.. రాష్ట్రానికి నావంతు సహకారం అందిస్తా!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
- రాష్ట్రం అభివృద్ధిపథంలో కొనసాగాలని కోరుకుంటున్నా
- ప్రకటనను విడుదల చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
నరేంద్రమోదీ ప్రధానిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా చూపించిన సమాఖ్య స్ఫూర్తితో, రాజ్యాంగం కల్పించిన హక్కులు-బాధ్యతల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్నిరకాల సహాయసహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకు కేంద్రమంత్రిగా నా వంతు కృషి చేస్తానని తెలంగాణ ప్రజలకు మాటిస్తున్నా’ అని కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.