టీడీపీ నేత సుజనా చౌదరి ఇళ్లు, ఆఫీసుల్లో కొనసాగుతున్న సీబీఐ, ఈడీ సోదాలు!
- నిన్న ప్రారంభమైన తనిఖీలు
- నలుగురు డైరెక్టర్లు అదుపులోకి
- ఆంధ్రాబ్యాంక్ కు రూ.71 కోట్ల రుణం ఎగ్గొట్టిన కేసులో విచారణ
కర్ణాటకలో వ్యాపారం నిర్వహించిన బెస్ట్ అండ్ కాంప్టన్ సంస్థ తప్పుడు ఇన్వాయిస్ లను సృష్టించి ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.71 కోట్ల రుణం పొందింది. అయితే ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో సీబీఐ కేసు నమోదుచేసింది. నిన్న సుజనా ఇళ్లు, కార్యాలయాలపై దాడిచేసిన అధికారులు పలు కీలక పత్రాలు, హార్డ్ డ్రైవ్ లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.