Australia: ఆసీస్ ముందు 208 పరుగుల లక్ష్యాన్నుంచిన ఆఫ్ఘనిస్థాన్

షార్ట్స్‌లో చూడండి
బలమైన ఆస్ట్రేలియా జట్టుతో బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 207 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్లు 38.2 ఓవర్లలో అంతా అవుటయ్యారు. ఆ జట్టులో నజీబుల్లా జాద్రాన్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొదట్లో రహ్మత్ షా 43 పరుగులు చేయగా, మిడిలార్డర్ లో కెప్టెన్ గుల్బదిన్ నాయబ్ 31, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ ఎంతో పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ తీయగా, పాట్ కమ్మిన్స్, ఆడమ్ జంపా చెరో 3 వికెట్లు పడగొట్టారు. స్టొయినిస్ కు రెండు వికెట్లు లభించాయి.
Go Back to Shorts
Australia

More Telugu News