రీవెరిఫికేషన్ లోనూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం... అనామికకు 48 కాదు 21 మార్కులే వచ్చాయట!
- మరోసారి అనామిక మార్కుల విషయంలో గందరగోళం
- అనామిక తల్లిదండ్రుల విమర్శలు
- మాటమార్చిన ఇంటర్ బోర్డు!
అయితే, రీవెరిఫికేషన్ లో ఆ అమ్మాయికి 48 మార్కులు వచ్చినట్టు మార్కుల మెమో చెబుతోంది. ఈ నేపథ్యంలో అనామిక తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు నిర్వాకంపై విమర్శలు చేయడంతో అధికారులు వెంటనే మాటమార్చారు. అనామిక రీవెరిఫికేషన్ లో కూడా పరీక్ష తప్పిందని, ఆమెకు వచ్చింది 21 మార్కులే అని తెలిపారు. మార్కుల మెమోలో పొరబాటున 48 మార్కులుగా అప్ లోడ్ అయిందని వివరించారు. అధికారుల ప్రకటనతో అనామిక మార్కుల విషయంలో గందరగోళం ఏర్పడింది. దాంతో విద్యాశాఖ అనామిక వ్యవహారంలో హడావుడిగా కమిటీ ఏర్పాటు చేసింది.