ఢిల్లీలో రాంమాధవ్‌ను కలిసిన తెలంగాణ సీనియర్ టీడీపీ నేతలు.. జంప్ అంటూ ప్రచారం
- రాం మాధవ్‌ను కలిసిన పెద్దిరెడ్డి, సురేశ్ రెడ్డి
- బీజేపీలో చేరబోతున్నారంటూ ప్రచారం
- అభినందించేందుకే వచ్చామన్న టీటీడీపీ నేతలు
త్వరలోనే వీరు బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. వీరివెంట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఉండడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో స్పందించిన పెద్దిరెడ్డి ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. రాంమాధవ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు అభినందనలు చెప్పేందుకే కలిశామని వివరణ ఇచ్చారు.