India: పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ఖరారు

షార్ట్స్‌లో చూడండి
కేంద్రంలో కొత్తగా  ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జూన్ 19న లోక్ సభ స్పీకర్ ఎన్నిక చేపడతారు. కేంద్రంలో మరోమారు ఎన్డీయే ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సహా 58 మందితో క్యాబినెట్ నిన్న రాష్ట్రపతిభవన్ లో ప్రమాణస్వీకారం చేసింది. క్యాబినెట్ సభ్యులకు ఇవాళ శాఖలు కూడా కేటాయించారు.
Go Back to Shorts
India
Lok Sabha

More Telugu News