మణిపూర్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్.. 12 మంది ఎమ్మెల్యేల రాజీనామా
- ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్
- రాష్ట్రంలో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా
- రాజీనామా చేసిన వారందరూ బీజేపీలో చేరుతారని ప్రచారం
సీడబ్ల్యూసీ సభ్యుడు, పీసీసీ చీఫ్ గయ్‌ఖంగంకు తమ రాజీనామా పత్రాలను అందించారు. కాగా, రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు అందరూ బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలపై సీనియర్ నేత ఒకరు స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశారు. పార్టీని కిందిస్థాయి నుంచి బలోపేతం చేసి కార్యకర్తల్లో పార్టీపై నమ్మకం పెంచేందుకే తాము రాజీనామా చేసినట్టు తెలిపారు.