మోదీ కేబినెట్ లోకి అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ కేబినెట్ లోకి అమిత్ షా

  • అత్యంత విశ్వాసపాత్రుడిని కేబినెట్ లోకి తీసుకోనున్న మోదీ
  • పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే కేంద్ర మంత్రిగా అమిత్ షా
  • కాసేపట్లో ప్రారంభంకానున్న ప్రమాణస్వీకార కార్యక్రమం
మరో రెండు గంటల్లో దేశ ప్రధానిగా మోదీ రెండో సారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అనంతరం కొత్త కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారు. కేంద్ర మంత్రుల జాబితా ఇప్పటికే బయటకు వచ్చింది. మరోవైపు, తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన అమిత్ షాకు కూడా తన కేబినెట్ లో మోదీ అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా మోదీతో పాటు అమిత్ షా కూడా ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షాను కొనసాగిస్తూనే... ఆయనను కేబినెట్ లోకి కూడా తీసుకోవాలని మోదీ నిర్ణయించినట్టు సమాచారం. 
modi
Amit Shah
cabinet

More Telugu News