కనిపించినోళ్లను కనిపించినట్టు పొడిచేశాడు.. జపాన్‌లో దారుణం!
- రైల్వే స్టేషన్‌లోని ప్రయాణికులపై దాడి
- పొడుచుకుంటూ పోయిన నిందితుడు
- అనంతరం తనను తాను గాయపర్చుకున్న వైనం
దీంతో స్టేషన్‌లో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. 16 మందిని గాయపరిచిన తర్వాత నిందితుడు తనను తాను గాయపరుచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారి, నిందితుడు మృతి చెందినట్టు తెలుస్తోంది.