50 శాతం ఓట్లు కొల్లగొడతామని చెప్పాం.. కొట్టి చూపించాం!: బీజేపీ చీఫ్ అమిత్ షా
- మోదీ నాయకత్వంలో విజయంపై ధీమాగా ఉన్నాం
- కానీ కొందరు మా విజయంపై అనుమానాలు వ్యక్తంచేశారు
- ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు
అయితే ప్రధాని మోదీ నాయకత్వంలో కనీసం 50 శాతం ఓట్లను దక్కించుకుంటామనీ, భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తామని తనకు నమ్మకం ఉండేదని పేర్కొన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లో 50 శాతానికి మించి ఓట్లు సాధించామనీ, మరో 9 రాష్ట్రాల్లో 45 నుంచి 50 శాతం ఓట్లు సాధించామని చెప్పారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో వెల్లూరు స్థానానికి ఎన్నికలు రద్దుకావడంతో 542 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.