West Bengal: ఫలితాలపై ఎవరూ బాధపడవద్దు... వీవీ ప్యాట్లు లెక్కించేంత వరకు వేచిచూద్దాం: మమతా బెనర్జీ

  • ఓడిపోయినంత మాత్రాన అంతా కోల్పోయినట్టు కాదు
  • ఓటమిపాలైన అభ్యర్థులను ఊరడించిన దీదీ
  • 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఎన్నికల కౌంటింగ్ ఫలితాలపై పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే తన అభిప్రాయాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. బెంగాల్ లో ఓటమిపాలైన తృణమూల్ అభ్యర్థులు బాధపడవద్దని, ఈవీఎం కౌంటింగ్ పూర్తయిన తర్వాత వీవీ ప్యాట్లు లెక్కించేంతవరకు వేచిచూద్దామని ఊరడించారు.

అయినా ఓడినంత మాత్రాన అంతా కోల్పోయినట్టు కాదని అన్నారు. ఓట్ల లెక్కింపులో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న తరుణంలో దీదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో 42 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా, గత ఎన్నికల్లో బీజేపీకి పశ్చిమ బెంగాల్ లో కేవలం 2 సీట్లు దక్కాయి. ఈసారి ఆ పార్టీ 18 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది.

More Telugu News